ఇస్లాం ఎప్పుడూ ప్రమాదంలో పడదు

ABN , First Publish Date - 2023-06-02T02:55:47+05:30 IST

ఇస్లాం ఎప్పుడూ ప్రమాదంలో పడదని, బీజేపీ ‘హిందూత్వ ఎజెండా’ కారణంగా ప్రమాదంలో పడ్డదల్లా దేశం, రాజ్యాంగం, సామాజిక సంబంధాలు అని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.

ఇస్లాం ఎప్పుడూ   ప్రమాదంలో పడదు

బీజేపీ హిందూత్వ ఎజెండాతో ప్రమాదంలో దేశం: అసదుద్దీన్‌ ఒవైసీ

న్యూఢిల్లీ, జూన్‌ 1: ఇస్లాం ఎప్పుడూ ప్రమాదంలో పడదని, బీజేపీ ‘హిందూత్వ ఎజెండా’ కారణంగా ప్రమాదంలో పడ్డదల్లా దేశం, రాజ్యాంగం, సామాజిక సంబంధాలు అని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు సైద్ధాంతిక రచయిత, ప్రధాన ప్రచారకర్త ప్రధాని మోదీయేనని తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో మతపరమైన ఏకీకకరణ జరగడం లేదని అభిప్రాయపడ్డారు. రెండు వర్గాలు సమాన స్థాయిలో ఉన్నప్పుడే మతపరమైన ఏకీకరణ జరుగుతుందని, వాస్తవానికి ప్రజల్లో ఎక్కువమంది బీజేపీ ఎత్తుకున్న ఎజెండాను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఇండియా టుడే సదస్సుల్లో ఒవైసీ మాట్లాడారు. బీజేపీ హిందూత్వ ఎజెండా కారణంగా ఎన్నికల్లో మజ్లి్‌సకు మేలే జరుగతోందని, దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోతామేమోనన్న ఆందోళనతో ముస్లిం వర్గం అంతా తమకే ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు భవనాన్ని మోదీ ప్రారంభించిన విధానాన్ని చూస్తే ఆయన ఒకే మతానికి ప్రధానిగా ఉన్నారా? అని అనిపిస్తోందన్నారు. హిందూ ప్రతినిఽధుల సమక్షంలో హిందూ మతానికి సంబంధించిన ఓ సింబల్‌ (రాజదండం)కు నమస్కరిస్తూ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని తప్పుబట్టారు.

Updated Date - 2023-06-02T02:55:47+05:30 IST