హైపర్‌సోనిక్‌ క్షిపణిని రూపొందించిన ఇరాన్‌

ABN , First Publish Date - 2023-06-07T06:39:51+05:30 IST

అత్యాధునిక క్షిపణిని రూపొందించినట్టు మంగళవారం ఇరాన్‌ ప్రకటించింది. ధ్వని వేగం కన్నా 15 రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌ ‘ఫతా’ (విజేత)ను

హైపర్‌సోనిక్‌ క్షిపణిని రూపొందించిన ఇరాన్‌

దుబాయ్‌, జూన్‌ 6: అత్యాధునిక క్షిపణిని రూపొందించినట్టు మంగళవారం ఇరాన్‌ ప్రకటించింది. ధ్వని వేగం కన్నా 15 రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌ ‘ఫతా’ (విజేత)ను ఆవిష్కరించామని తెలిపింది. ఇది 1,400 కి.మీ. రేంజ్‌లో పనిచేస్తుందని రివల్యూషనరీ గార్డ్స్‌ చీఫ్‌ జనరల్‌ అమీర్‌ అలీ హజిజాదా తెలిపారు. దీన్ని ఎదుర్కొనే క్షిపణి వ్యవస్థ ఏదీ లేదని చెప్పారు. సాధారణంగా హైపర్‌సోనిక్‌ క్షిపణులు ధ్వని వేగం కన్నా అయిదు రెట్లు వేగంతో ప్రయాణిస్తుంటాయి. అయితే ఇది 15 రెట్లు వేగంగా వెళ్తుందని చెబుతుండడం గమనార్హం.

Updated Date - 2023-06-07T06:39:51+05:30 IST