Share News

రుతుపవనాల వల్లే భారత్‌పై దండయాత్రలు!

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:01 AM

దాదాపు రెండు వేల ఏళ్ల కిందట భారత దేశంపై జరిగిన దండయాత్రలకు, రుతుపవనాలకు సంబంధం ఉందని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు వెల్లడించారు.

రుతుపవనాల వల్లే భారత్‌పై దండయాత్రలు!

అహ్మదాబాద్‌, డిసెంబరు 25: దాదాపు రెండు వేల ఏళ్ల కిందట భారత దేశంపై జరిగిన దండయాత్రలకు, రుతుపవనాలకు సంబంధం ఉందని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు వెల్లడించారు. ‘‘అప్పట్లో మధ్య ఆసియా ప్రాంతం కరువును ఎదుర్కొంది. అదేసమయంలో భారత్‌లో రుతుపవనాల కారణంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండాయి. దీంతో మధ్య ఆసియా నుంచి భారత్‌పై దండయాత్రలు జరిగాయి’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు, ఏఎస్‌ఐ, జేఎన్‌యూ సహా పలు సంస్థలకు చెందిన అధ్యయనకర్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 06:47 AM