సత్యేందర్‌ జైన్‌కు మధ్యంతర బెయిల్‌

ABN , First Publish Date - 2023-05-27T04:04:12+05:30 IST

మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయి.. సరిగ్గా ఏడాది నుంచి జైలులో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కీలక నేత సత్యేందర్‌ జైన్‌ (58)కు ఎట్టకేలకు ఉపశమనం దక్కింది.

సత్యేందర్‌ జైన్‌కు మధ్యంతర బెయిల్‌

ఢిల్లీ, మే 26: మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయి.. సరిగ్గా ఏడాది నుంచి జైలులో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కీలక నేత సత్యేందర్‌ జైన్‌ (58)కు ఎట్టకేలకు ఉపశమనం దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని జూలై 11 వరకు (ఆరు వారాలు) బెయిల్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా పలు షరతులు సైతం విధించింది. ముందుగా అనుమతి తీసుకోకుండా ఢిల్లీ దాటి బయటకు వెళ్లొద్దని, మీడియాతో మాట్లాడవద్దని స్పష్టం చేసింది. ఆయన కోరుకున్న ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చని, దానికి సంబంధించిన వైద్య నివేదికలను జూలై 10వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించింది. జైన్‌ను గత ఏడాది మే చివరలో ఈడీ అరెస్టు చేసింది. అప్పటినుంచి ఆయన తిహాడ్‌ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ వ్యవధిలో జైన్‌ ఆరోగ్యం బాగా క్షీణించింది.

Updated Date - 2023-05-27T04:04:12+05:30 IST