కీలక రంగాల్లో భారత్ పురోగతి
ABN , First Publish Date - 2023-03-05T01:18:01+05:30 IST
ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం వంటి కీలక రంగాల్లో భారత్ ఎంతో పురోగతి చెందుతోందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రశంసించారు. భారత్ సాధిస్తున్న పురోగతిపై తాను..
టెక్ దిగ్గజం బిల్‌గేట్స్ ప్రశంసలు
న్యూఢిల్లీ, మార్చి 4: ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం వంటి కీలక రంగాల్లో భారత్ ఎంతో పురోగతి చెందుతోందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రశంసించారు. భారత్ సాధిస్తున్న పురోగతిపై తాను మరింత ఆశావహ దృక్పథంతో ఉన్నానని పేర్కొన్నారు. సృజనాత్మక రంగంలో పెట్టుబడులుపెడితే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో భారత్ నిరూపిస్తోందన్నారు. భారత్ పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్ శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆరోగ్య రంగం, పర్యావరణ మార్పులు తదితర అంశాల గురించి ఇద్దరు చర్చించుకున్నారు. ఈ భేటీ వివరాలను బిల్‌గేట్స్ తన అధికారిక బ్లాగ్‌లో రాసుకున్నారు. సురక్షితమైన, సమర్థమంతమైన, చౌకధరలకు అందుబాటులో ఉండే వ్యాక్సిన్లను భారత్ తయారు చేసిందని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో ఈ వ్యాక్సిన్లు ప్రపంచంలో కోట్లాది మందిని కాపాడాయని, ఇతర వ్యాధులు రాకుం డా నివారించాయని ప్రశంసించారు. కో-విన్ ప్లాట్‌ఫామ్ ద్వారా భారత్ 220కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిందన్నారు. ‘ప్రపంచానికి కో-విన్ ఓ మోడల్ అవుతుందని ప్రధాని మోదీ విశ్వసించారు. ఈ విషయాన్ని నేను అంగీకరిస్తున్నా’ అని పేర్కొన్నారు.