Share News

Garba Dance: టైమ్ స్వ్కేర్‌ వద్ద గర్బా ప్రదర్శన.. విదేశీయులను ఆకట్టుకున్న నృత్యం

ABN , First Publish Date - 2023-12-08T14:32:38+05:30 IST

గుజరాత్‌ ప్రముఖ గర్బా నృత్యానికి(Garba Dance) యునెస్కో గుర్తింపు ల‌భించిన విషయం విదితమే. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించే గర్బాను ఈ జాబితాలో చేర్చాలంటూ భారత్ గతంలో నామినేట్ చేసింది.

Garba Dance: టైమ్ స్వ్కేర్‌ వద్ద గర్బా ప్రదర్శన.. విదేశీయులను ఆకట్టుకున్న నృత్యం

న్యూయార్క్: గుజరాత్‌ ప్రముఖ గర్బా నృత్యానికి(Garba Dance) యునెస్కో గుర్తింపు ల‌భించిన విషయం విదితమే. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించే గర్బాను ఈ జాబితాలో చేర్చాలంటూ భారత్ గతంలో నామినేట్ చేసింది. అమెరికాలోని న్యూయార్క్ టైం స్వ్కేర్ వద్ద ప్రఖ్యాత గర్బా డ్యాన్స్ చేసి అలరించారు గుజరాతీలు. యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చినందుకుగానూ ఈ సెలబ్రెషన్స్ జరుపుకున్నట్లు వారు తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో పురుషులు, మహిళలు టైమ్ స్క్వేర్ వద్ద గర్బా నృత్యం అలరించింది. నృత్యాలు అమెరికన్లను అమితంగా ఆకట్టుకున్నాయి.

UNESCO ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ X లో ఒక పోస్ట్‌లో "గర్బా అనేది జీవితం, ఐక్యత, లోతైన సంప్రదాయాల వేడుక. ఇది భారతీయ సంస్కృతి అందాన్ని ప్రపంచానికి చూపుతుంది. ఈ గౌరవం మన వారసత్వాన్ని సంరక్షించడానికి, భవిష్యత్తు తరాలకు ప్రచారం చేయడానికి స్ఫూర్తినిస్తుంది. గార్బాకు ప్రపంచ గుర్తింపు రావడం సంతోషకరం" అని అన్నారు.

వీడియో కోసం కింద ఇచ్చిన ఎక్స్ లింక్‌ని క్లిక్ చేయండి...

Updated Date - 2023-12-08T14:36:34+05:30 IST