భారత్ ఆందోళనకర దేశం!
ABN , Publish Date - Dec 17 , 2023 | 05:37 AM
ఖలిస్థాన్ తీవ్రవాది నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రభుత్వ హస్తం ఉందన్న ఆరోపణలపై నిజానిజాలు తేలకముందే అమెరికాలోని మత స్వేచ్ఛ పరిరక్షణ కమిషన్ బైడెన్
వాషింగ్టన్, డిసెంబరు 16: ఖలిస్థాన్ తీవ్రవాది నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రభుత్వ హస్తం ఉందన్న ఆరోపణలపై నిజానిజాలు తేలకముందే అమెరికాలోని మత స్వేచ్ఛ పరిరక్షణ కమిషన్ బైడెన్ ప్రభుత్వానికి ఓ కఠినమైన సూచన చేసింది. ఆ కేసును దృష్టిలో పెట్టుకొని భారత్‌ను ‘ఒక విధంగా ఆందోళన చెందాల్సిన దేశం’గా పరిగణించి అమెరికా మత స్వేచ్ఛ చట్టం ప్రకారం ఆంక్షలు విధించాలని సిఫార్సు చేసింది. భారత్‌లో మైనార్టీలకు మత స్వేచ్ఛ లేదని తెలిపింది. యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం అనే స్వతంత్ర ప్రతిపత్తిగల ఫెడరల్ ప్రభుత్వ సంస్థ తన వార్షిక నివేదికలో ఈ సూచన చేసింది. మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న భారత ప్రభుత్వ సంస్థలు, అధికారులు అమెరికాకు రాకుండా నిషేధించాలని తెలిపింది. వారి ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొంది.