గాంబియా పిల్లల మరణాలకు ఇండియా దగ్గు మందే కారణం!

ABN , First Publish Date - 2023-03-05T01:08:36+05:30 IST

గాంబియాలో చాలా మంది పిల్లల మరణాలకు, ఇండియాలో తయారైన దగ్గు మందు వినియోగానికి మధ్య బలమైన సంబంధం ఉందని అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌

గాంబియా పిల్లల మరణాలకు ఇండియా దగ్గు మందే కారణం!

న్యూఢిల్లీ, మార్చి 4: గాంబియాలో చాలా మంది పిల్లల మరణాలకు, ఇండియాలో తయారైన దగ్గు మందు వినియోగానికి మధ్య బలమైన సంబంధం ఉందని అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ), గాంబియా వైద్య అధికారుల సంయుక్త పరిశోధనలో తేలింది. ‘‘ఆ దగ్గు మందులలో డైథైలిన్‌ గ్లైకాల్‌(డీఈజీ), ఇథైలిన్‌ గ్లైకాల్‌(ఈజీ)లతో కలుషితమై ఉంది. డీజీఈ, ఈజీలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు వైఫల్యం చెందుతాయి. గాంబియాలో చనిపోయిన చాలా మంది పిల్లలు మూత్రపిండాల వైఫల్యంతోనే మరణించారు. అని శుక్రవారం నాడు విడుదల చేసిన నివేదిక సీడీసీ వెల్లడించింది. ఇండియాలో తయారై గాంబియాకు ఎగుమతి చేస్తున్న మెయిడెన్‌ ఫార్మా లిమిటెడ్‌కు చెందిన దగ్గు మందులు నాసిరకమైనవని, వాటిని ఔషధంగా తీసుకోవడం వల్లే పిల్లలు మృతి చెందారని గతేడాది అక్టోబరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Updated Date - 2023-03-05T01:08:36+05:30 IST