భారత్‌-బ్రిటన్‌ భద్రతా సలహాదారుల భేటీ

ABN , First Publish Date - 2023-02-06T00:39:42+05:30 IST

భారత్‌, బ్రిటన్‌ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎ్‌సఏ)లు అజిత్‌ డోభాల్‌, టిమ్‌ బారో మధ్య లండన్‌లో జరిగిన సమావేశానికి ఊహించని అతిథి ఒకరు హాజరయ్యారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఆకస్మికంగా

భారత్‌-బ్రిటన్‌ భద్రతా సలహాదారుల భేటీ

అనుకోని అతిథిగా బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ .. డోభాల్‌తో ముచ్చట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత్‌, బ్రిటన్‌ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎ్‌సఏ)లు అజిత్‌ డోభాల్‌, టిమ్‌ బారో మధ్య లండన్‌లో జరిగిన సమావేశానికి ఊహించని అతిథి ఒకరు హాజరయ్యారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఆకస్మికంగా వచ్చి వీరిద్దరి భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు డోభాల్‌లో ముచ్చటించారు. కాగా, గత మంగళవారం వాషింగ్టన్‌లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌తో సమావేశం అనంతరం డోభాల్‌ లండన్‌ చేరుకున్నారు. అక్కడ శనివారం టిమ్‌ బారోతో భేటీ అయ్యారు.

Updated Date - 2023-02-06T00:39:43+05:30 IST