ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో ‘బచ్చా, బిందాస్’
ABN , First Publish Date - 2023-02-01T02:29:07+05:30 IST
బచ్చా, బిందాస్, దేశ్, దియా, అల్మారా... భారతీయులు వాడే ఈ పదాలు ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ(ఓఈడీ)లో చోటు దక్కించుకున్నాయి.
న్యూఢిల్లీ, జనవరి 31: బచ్చా, బిందాస్, దేశ్, దియా, అల్మారా... భారతీయులు వాడే ఈ పదాలు ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ(ఓఈడీ)లో చోటు దక్కించుకున్నాయి. ఇవే కాదు 800కు పైగా భారతీయ ఆంగ్ల పదాల ఆడియో ఫైల్స్, ఉచ్ఛరణ విధానాలను ఓఈడీలో చేర్చారు. పదానికి అర్థం, దానిని పలికే విధానం, పదాన్ని ఎక్కడ వినియోగిస్తారనే సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న వేర్వేరు ఆంగ్ల ఉచ్ఛరణలను 2016 నుంచి ఓఈడీలో చేరుస్తున్నారు. భారతీయ ఆంగ్ల పదాల ఉచ్ఛరణల చేరికతో 16 రకాల ఆంగ్ల పద సంపద ఓఈడీలో ఉన్నట్టు అయ్యింది.