Ilayaraja: శీతాకాల సమావేశాల్లో ఇళయరాజా హాజరు నిల్‌

ABN , First Publish Date - 2023-01-25T10:41:29+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రాజ్యసభ సభ్యుడైన సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja) ఒక్కసారి కూడా రాలేదని రిజిస్టర్‌ ద్వారా తెలిసింది.

Ilayaraja: శీతాకాల సమావేశాల్లో ఇళయరాజా హాజరు నిల్‌

పెరంబూర్‌(చెన్నై), జనవరి 24: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రాజ్యసభ సభ్యుడైన సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja) ఒక్కసారి కూడా రాలేదని రిజిస్టర్‌ ద్వారా తెలిసింది. పలు రంగాల్లో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా నియమిస్తుంటారు. ఆ కోవలో సంగీత దర్శకుడు ఇళయరాజా, అథ్లెటిక్‌ పీటీ ఉష, సినీ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌, వీరేంద్ర హెగ్డే తదితరులు రాజ్యసభ సభ్యులుగా ఎంపిక కాగా, గత ఏడాది జూలైలో జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో అమెరికాలో సంగీత కచ్చేరిలో పాల్గొనేందుకు వెళ్లడంతో ఇళయరాజా పదవీప్రమాణం చేయలేదు. తిరిగొచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడుగా ఆయన పదవీ ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో, పార్లమెంటు శీతాకాల సమావేశాలు గత ఏడాది డిసెంబరు 7 నుంచి 23వ తేది వరకు జరిగాయి. 13 రోజులు జరిగిన ఈ సమావేశాల్లో పాల్గొన్న సభ్యుల వివరాలు వెల్లడించారు. ఆ ప్రకారం పీటీ ఉష 13 రోజులు, వీరంద్ర హెగ్డే 5 రోజులు, విజయేంద్ర ప్రసాద్‌ రెండు రోజులు పాల్గొన్నారు. అందులో ఇళయరాజా ఒక్క రోజు కూడా పాల్గొనలేదంటూ, ఆయన అటెండెన్స్‌లో ‘0’ వేశారు.

Updated Date - 2023-01-25T10:41:31+05:30 IST