సిద్దరామయ్యను నిర్లక్ష్యం చేస్తే కాంగ్రె్‌సకు ఏపీ గతే
ABN , First Publish Date - 2023-04-03T01:34:46+05:30 IST
ప్రతిపక్షనేత సిద్దరామయ్యను నిర్లక్ష్యం చేస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పట్టిన దుస్థితే వస్తుందని శ్రీనివాసపుర ఎమ్మెల్యే రమేశ్‌కుమార్
బెంగళూరు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత సిద్దరామయ్యను నిర్లక్ష్యం చేస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పట్టిన దుస్థితే వస్తుందని శ్రీనివాసపుర ఎమ్మెల్యే రమేశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. సిద్దరామయ్య కోలారులో పోటీ చేయకుంటే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మునిగిపోతుందన్నారు. దీనిపై రాహుల్‌గాంధీకి సమగ్రంగా వివరించాల్సి ఉందన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సిద్దరామయ్యను మరోసారి ప్రతిపక్షనేతగానే కూర్చోబెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.