మంచి విధానమే అయితే ఎందుకు వెనక్కి తీసుకున్నట్లు?

ABN , First Publish Date - 2023-06-02T04:36:52+05:30 IST

ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సయిజ్‌ విధానం అంత మంచిదే అయితే ఎందుకు ఉపసంహరించుకున్నారని గురువారం ఢిల్లీ హైకోర్టు సిసోడియాను ప్రశ్నించింది.

మంచి విధానమే అయితే ఎందుకు వెనక్కి తీసుకున్నట్లు?

ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సయిజ్‌ విధానం అంత మంచిదే అయితే ఎందుకు ఉపసంహరించుకున్నారని గురువారం ఢిల్లీ హైకోర్టు సిసోడియాను ప్రశ్నించింది. ఈ కేసులో సహ నిందితునిగా ఉన్న విజయ్‌ నాయర్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్‌ దినేష్‌ కుమార్‌ శర్మ..సిసోడియా న్యాయవాదిని ఉద్దేశించి ఈ ప్రశ్న వేశారు. దీనిపై ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టాలని ఆదేశించారు. మరోవైపు తన భార్య ఆరోగ్యం దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలన్న సిసోడియా దరఖాస్తు శుక్రవారం కోర్టు పరిశీలనకు రానుంది.

Updated Date - 2023-06-02T04:37:05+05:30 IST