భారత్‌ చంద్రుడిని చేరుకుంటే పాక్‌ అడుక్కు తింటోంది

ABN , First Publish Date - 2023-09-20T03:50:07+05:30 IST

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భారతదేశంపై ప్రశంసలు కురిపిస్తూ, తమ దేశంపై విమర్శలు గుప్పించారు. భారతదేశం చంద్రుడిని చేరుకునే స్థాయికి ఎదిగితే పాకిస్థాన్‌ మాత్రం ఇతర దేశాల దగ్గర దేహీ అంటూ అడుక్కు తింటోందని ఆయన విమర్శించారు.

భారత్‌ చంద్రుడిని చేరుకుంటే పాక్‌ అడుక్కు తింటోంది

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌

లాహోర్‌, సెప్టెంబరు 19: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భారతదేశంపై ప్రశంసలు కురిపిస్తూ, తమ దేశంపై విమర్శలు గుప్పించారు. భారతదేశం చంద్రుడిని చేరుకునే స్థాయికి ఎదిగితే పాకిస్థాన్‌ మాత్రం ఇతర దేశాల దగ్గర దేహీ అంటూ అడుక్కు తింటోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న ఆయన లాహోర్‌లోని తన పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ సభ్యులతో సోమవారం పర్చ్యువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ, ‘‘భారత్‌ చంద్రుడిపైకి రాకెట్‌ను విజయవంతంగా పంపింది. అలాగే ప్రతిష్ఠాత్మక జీ- 20 సమావేశాలను ఘనంగా నిర్వహించింది. అదే సమయంలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి మాత్రం నిధుల కోసం ఇతర దేశాల దగ్గర దేహీ అంటూ అడుక్కుంటున్నారు. దేశం ఇలా ఆర్థిక సంక్షోభానికి గురవడానికి మాజీ జనరళ్లు, కొందరు న్యాయమూర్తులే కారణం.’’ అని విరుచుకుపడ్డారు. తాను ప్రధాని పదవి కోల్పోవడానికి నలుగురు న్యాయమూర్తులు, అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమల్‌ జావిద్‌ బజ్వా, ఐఎ్‌సఐ చీఫ్‌ ఫయాజ్‌ హమీద్‌ కారణమని ఆరోపించారు.

Updated Date - 2023-09-20T03:50:07+05:30 IST