ఈవీఎం సమస్యలు తేల్చకుంటే.. బీజేపీకి 400కి పైగా సీట్లు!
ABN , Publish Date - Dec 29 , 2023 | 06:36 AM
ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)లపై కాంగ్రెస్ మరోసారి అనుమానాలు వ్యక్తంచేసింది. వీటిలో తలెత్తిన సమస్యలను వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే పరిష్కరించకుంటే.. బీజేపీ 400కిపైగా స్థానాలను
వీవీప్యాట్ స్లిప్పులు ఓటర్లకే ఇవ్వాలి
కాంగ్రెస్ సీనియర్ నేత పిట్రోడా
న్యూఢిల్లీ, డిసెంబరు 28: ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)లపై కాంగ్రెస్ మరోసారి అనుమానాలు వ్యక్తంచేసింది. వీటిలో తలెత్తిన సమస్యలను వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే పరిష్కరించకుంటే.. బీజేపీ 400కిపైగా స్థానాలను గెలుచుకోవడం ఖాయమన్నారు. అలాగే ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) స్లిప్పులు పెట్టెల్లో పడేటట్లు గాక నేరుగా ఓటర్ల చేతికే ఇచ్చేలా చేయాలని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు. ‘ది సిటిజెన్స్ కమిషన్ ఆన్ ఎలక్షన్స్’ అనే ఎన్జీవో తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకుర్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత వీవీప్యాట్ సిస్టమ్ డిజైన్‌ను సవరించాలని.. ఓటరే తనిఖీ చేసుకునేలా దానిని మార్చాలని ఆ నివేదికలో ప్రధాన సిఫారసుగా పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందన కోసం ఎదురుచూశానని.. స్పందించకపోవడంతో తానే మాట్లాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ రిపోర్టును బట్టి ఈవీఎంలపై విశ్వాసరాహిత్యం ఏర్పడిందని.. తిరిగి విశ్వాస కల్పనకు ఈసీ చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 400కిపైగా ఎంపీ స్థానాలను గెలుస్తామని బీజేపీ అంటోందని ప్రస్తావించగా.. దానిని నిర్ణయించాల్సింది ప్రజలని పిట్రోడా బదులిచ్చారు. ‘వచ్చే ఎన్నికలకు ముందే ఈవీఎం సమస్యలను పరిష్కరించాలి. లేదంటే బీజేపీకి 400 సీట్లు రావడం నిజం కావచ్చు. పరిష్కరిస్తే రాకపోవచ్చు’ అని చెప్పారు.