Idli lover: వరల్డ్‌ ఇడ్లీ డే సందర్భంగా స్విగ్గీ వెల్లడించిన విషయం తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !

ABN , First Publish Date - 2023-03-31T03:33:12+05:30 IST

ఇడ్లీకి మించిన అల్పాహారం ఏముంటుంది? ‘ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ..’ అంటూ ‘మిథునం’లో అప్పదాసు పాడుకోవడం గుర్తుండే ఉంటుంది! నంజుకునేందుకు కొబ్బరి చట్నీ లేకపోతేనేమీ.. పల్లీ చట్నీ..

Idli lover: వరల్డ్‌ ఇడ్లీ డే సందర్భంగా స్విగ్గీ వెల్లడించిన విషయం తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !

ఒకే ఒక్కడు.. ఏడాదిలో రూ.6 లక్షల ఇడ్లీలు!

ఆర్డర్‌ చేసిన హైదరాబాదీ 12 నెలల్లో 8,428 ప్లేట్లు

వరల్డ్‌ ఇడ్లీ డే సందర్భంగా స్విగ్గీ వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 30: ఇడ్లీకి (Idli) మించిన అల్పాహారం ఏముంటుంది? ‘ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ..’ అంటూ ‘మిథునం’లో అప్పదాసు పాడుకోవడం గుర్తుండే ఉంటుంది! నంజుకునేందుకు కొబ్బరి చట్నీ లేకపోతేనేమీ.. పల్లీ చట్నీ.. అదీ లేకుంటే వేడి వేడి సాంబారు ఉంటే చాలు.. ఓ నాలుగైదు ఇడ్లీలు ఊదేయొచ్చు!! మరి.. ఆయన గారికి ఇడ్లీలంటే ‘మరింత’ ఇష్టం కామోసు.. ఏడాదిలో 6 లక్షల రూపాయల విలువైన ఇడ్లీలను ఆర్డర్‌ చేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి గత ఏడాది మార్చి 30 నుంచి ఈ ఏడాది మార్చి 25వ తేదీ మధ్య 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్‌ చేసి తెప్పించుకున్నాడు! మార్చి 30న ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’గా ఈ విషయాన్ని ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) వెల్లడించింది. తన కోసం, తన కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం సదరు వ్యక్తి.. హైదరాబాద్‌ నుంచే కాకుండా బెంగళూరు, చెన్నైలోనూ ఉన్నప్పుడు కూడా ఆయన ఇడ్లీలను తమ సంస్థ నుంచి తెప్పించుకున్నాడని పేర్కొంది. గత 12నెలల్లో తాము దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది.

Updated Date - 2023-03-31T18:12:04+05:30 IST