IAS vs IPS : కర్ణాటకలో ఐఏఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్‌

ABN , First Publish Date - 2023-02-20T01:50:29+05:30 IST

కర్ణాటకలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. పలు వివాదాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవదాయశాఖ కమిషనర్‌ రోహిణి సింధూరి(ఐఏఎ్‌స)పై హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రూపాముద్గల్‌(ఐపీఎస్‌)

 IAS vs IPS : కర్ణాటకలో ఐఏఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్‌

బెంగళూరు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. పలు వివాదాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవదాయశాఖ కమిషనర్‌ రోహిణి సింధూరి(ఐఏఎ్‌స)పై హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రూపాముద్గల్‌(ఐపీఎస్‌) ఆదివారం ట్విటర్‌ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను కూడా అందులో పోస్ట్‌ చేశారు. ఐఏఎస్‌ రోహిణి, ఎమ్మెల్యే సారా మహేశ్‌తో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రూప ప్రశ్నించారు. ‘చామరాజనగరలో కొవిడ్‌ వేళ ఆక్సిజన్‌ అందక పలువురు మరణించిన అంశంలోనూ సక్రమంగా వ్యవహరించారా? కొవిడ్‌తో దేశమంతటా జనం తల్లడిల్లుతుంటే మైసూరు కలెక్టరేట్‌లో విలాసవంతమైన స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి’ అని విమర్శించారు. ఐపీఎస్‌ ఎన్‌.హరీశ్‌ మృతిపైనా అనుమానం వ్యక్తం చేశారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మించే విషయాన్నీ ప్రస్తావించారు. ఆమెకు ఎవరు మద్దతిస్తున్నారో? ఇటువంటి వారికి ఎందుకు శిక్షలు పడవో అర్థం కావడం లేదన్నారు.

న్యాయ పోరాటం చేస్తా : రోహిణి

తనపై ఆరోపణలు చేసిన రూపపై న్యాయ పోరాటం చేస్తానని రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ‘బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్నవారు సమాజానికి మంచి పనులు చేయాలిగానీ, వ్యక్తిగత విషయాలపై అబద్ధాలు పోస్టు చేయడం సరికాదు’ అన్నారు.

Updated Date - 2023-02-20T07:42:38+05:30 IST