Hoysala temples : హొయసళ ఆలయాలకు యునెస్కో గుర్తింపు
ABN , First Publish Date - 2023-09-20T03:39:56+05:30 IST
కర్ణాటకలో శిల్ప సౌందర్యానికి ఖ్యాతి గడించిన హొయసళ కాలంనాటి పురాతన దేవాలయాలు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. హాసన్ జిల్లాలోని బేళూరు

బెంగళూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో శిల్ప సౌందర్యానికి ఖ్యాతి గడించిన హొయసళ కాలంనాటి పురాతన దేవాలయాలు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. హాసన్ జిల్లాలోని బేళూరు చెన్నకేశవవస్వామి ఆలయం, హళేబీడు, మైసూరు జిల్లా సోమనాథపురలోని కేశవ ఆలయాలను ఈ జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. భారత్‌కు యునెస్కో శుభాకాంక్షలు తెలిపింది. వాస్తవానికి హోయసళకు గుర్తింపునిచ్చే అంశం 2014 నుంచి యునెస్కో పరిశీలనలో ఉంది. యునెస్కో నిర్ణయం పట్ల ప్రధాని మోదీ తదితరులు తమ హర్షం ప్రకటించారు.