కాంగ్రెస్‌ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి: దేవెగౌడ

ABN , First Publish Date - 2023-04-03T01:43:46+05:30 IST

లోక్‌సభ ఎన్నికల ముందు విపక్షాల ఐక్యత గురించి సర్వత్రా ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ముందు తన ఇల్లు చక్కబెట్టుకోవాలని జేడీఎస్‌ అగ్రనేత,

కాంగ్రెస్‌ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి: దేవెగౌడ

బెంగళూరు, ఏప్రిల్‌ 2: లోక్‌సభ ఎన్నికల ముందు విపక్షాల ఐక్యత గురించి సర్వత్రా ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ముందు తన ఇల్లు చక్కబెట్టుకోవాలని జేడీఎస్‌ అగ్రనేత, మాజీ ప్రధాని దేవెగౌడ హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీల ఎదుట అనేక ఆప్షన్లు ఉన్నాయని, ఈ దేశంలో నాయకత్వం వహించేవారికి కొదవ లేదని తేల్చిచెప్పారు. దేశంలో కాంగ్రెస్‌ ఒక్కటే ప్రతిపక్ష పార్టీ కాదన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇతర రాష్ట్రాల, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని చెప్పారు. గతంలోనూ అదే జరిగిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నప్పటికీ, జేడీఎస్‌ అధికారంలోకి వస్తుందని దేవెగౌడ విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-03T01:43:54+05:30 IST