హైవేలు వాహనాల కోసం.. జనం తిరగడానిక్కాదు
ABN , First Publish Date - 2023-11-21T04:08:34+05:30 IST
హైవేలు నిర్మించింది వాహనాల కోసమే తప్ప, జనం తిరగడానికి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాటిపై తిరుగుతామంటే అది క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందని తెలిపింది.

న్యూఢిల్లీ, నవంబరు 20: హైవేలు నిర్మించింది వాహనాల కోసమే తప్ప, జనం తిరగడానికి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాటిపై తిరుగుతామంటే అది క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందని తెలిపింది. హైవేలపై పాదచారులకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని గుజరాత్ హైకోర్టు కొట్టివేయగా పిటిషనర్ సుప్రీకోర్టులో అప్పీలు చేశాడు. దీనిపై సోమవారం జస్టిస్ కౌల్, జస్టిస్ ధులియాల ధర్మాసనం విచారణ జరిపింది. హైవేలపై జరుగుతున్న ప్రమాదాల్లో మరణించిన వారి గణాంకాలను పిటిషనర్ తరఫు న్యాయవాది చెబుతుండగా అసలు హైవేలపైకి ఎలా వెళ్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజలు కూడా నిబంధనలు పాటించాల్సి ఉందంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.