Nasal Covid vaccine : నాసికా కోవిడ్ టీకాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి మాండవీయ

ABN , First Publish Date - 2023-01-26T16:40:01+05:30 IST

భారత దేశంలో తయారైన, ప్రపంచంలో మొట్టమొదటి నాసికా కోవిడ్ టీకా (intranasal Covid vaccine)ను గురువారం ఆవిష్కరించారు.

Nasal Covid vaccine : నాసికా కోవిడ్ టీకాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి మాండవీయ
Mansukh Mandaviya, Jitendra Singh

న్యూఢిల్లీ : భారత దేశంలో తయారైన, ప్రపంచంలో మొట్టమొదటి నాసికా కోవిడ్ టీకా (intranasal Covid vaccine)ను గురువారం ఆవిష్కరించారు. దీనిని భారత్ బయోటెక్ (Bharat Biotech) తయారు చేసింది. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దీనిని కేంద్ర మంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మాండవీయ నివాసంలో జరిగింది.

పరిమిత అత్యవసర వినియోగానికి నాసికా కోవిడ్ టీకా ఇంకోవాక్ (iNCOVACC)కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి గత ఏడాది నవంబరులో లభించింది. దీనిని వయోజనులకు హెటిరోలాగస్ బూస్టర్ డోస్‌గా వాడవచ్చునని తెలిపింది.

భారత్ బయోటెక్ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంకోవాక్ ధర ప్రైవేట్ మార్కెట్లో రూ.800 కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325.

Updated Date - 2023-01-26T16:40:05+05:30 IST