ఇరాన్‌లో హిజాబ్‌ లేకుంటే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2023-09-22T02:46:48+05:30 IST

మహిళలు హిజాబ్‌ ధరించకపోవడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఇరాన్‌ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు హిజాబ్‌ ధరించకపోయినా, అలాంటి మహిళలకు మద్దతు తెలిపినా

ఇరాన్‌లో హిజాబ్‌ లేకుంటే కఠిన చర్యలు

దుబాయ్‌, సెప్టెంబరు 21: మహిళలు హిజాబ్‌ ధరించకపోవడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఇరాన్‌ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు హిజాబ్‌ ధరించకపోయినా, అలాంటి మహిళలకు మద్దతు తెలిపినా కఠిన శిక్షలు విధించాలని నిర్ణయించింది. గతంలో ఈ డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించిందుకు అరెస్టయిన మాషా ఆమిని (22) అనే యువతి ప్రాణాలు కోల్పోయి ఏడాది పూర్తయిన సందర్భంలోనే పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించడం గమనార్హం. హిజాబ్‌ను ధరించని మహిళలను ఉద్యోగంలో పెట్టుకున్న వ్యాపారవేత్తలకు భారీగా జరిమానా విధిస్తారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే పదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. పార్లమెంటులోని మొత్తం 290 మంది సభ్యులకుగానూ 152 మంది ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ బిల్లుకు మతపెద్దల సంస్థ అయిన గార్డియన్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలపాల్సి ఉంది.

Updated Date - 2023-09-22T02:46:57+05:30 IST