హఫీజ్ సయీద్‌ను అప్పగించండి
ABN , Publish Date - Dec 29 , 2023 | 06:33 AM
లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ముంబై ఉగ్ర దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్ మరోసారి కోరింది. ఈ మేరకు భారత విదేశాంగ
పాకిస్థాన్‌ను మరోసారి కోరిన భారత్
న్యూఢిల్లీ, డిసెంబరు 28: లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ముంబై ఉగ్ర దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్ మరోసారి కోరింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ పాక్ ప్రభుత్వానికి లేఖ పంపింది. సయీద్ అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియను మొదలుపెట్టాలని అందులో పేర్కొంది. ముంబై దాడులపై న్యాయ విచారణ కోసం అతడిని అప్పగించాలని పాక్‌ను భారత్ పదేపదే కోరుతోంది.