గుర్మీత్ కరడుగట్టిన క్రిమినల్ కాదు: హరియాణా
ABN , First Publish Date - 2023-03-02T01:34:10+05:30 IST
డేరా సచ్ సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్‌కు పెరోల్ ఇవ్వడాన్ని హరియాణా ప్రభుత్వం సమర్థించుకొంది. ఆయన కరుడుగట్టిన క్రిమినల్ కాదని తెలిపింది.
చండీగఢ్, మార్చి 1: డేరా సచ్ సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్‌కు పెరోల్ ఇవ్వడాన్ని హరియాణా ప్రభుత్వం సమర్థించుకొంది. ఆయన కరుడుగట్టిన క్రిమినల్ కాదని తెలిపింది. రెండు హత్య కేసుల్లో శిక్షలు పడినప్పటికీ వాటిని సీరియల్ మర్డర్లుగా పరిగణించకూడదని పేర్కొంది. అత్యాచార, హత్య కేసుల్లో గుర్మీత్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఆయనకు జైలు అఽధకారులు 40 రోజుల పెరోల్ ఇవ్వగా, దాన్ని సవాలు చేస్తూ శిరోమణి గురుద్వారా ప్రభందక్ కమిటీ హైకోర్టులో పిటిషన్ వేసింది.