Share News

iPhone Users: ఐఫోన్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. కేంద్రం ఏం చెప్పిందంటే?

ABN , Publish Date - Dec 16 , 2023 | 02:48 PM

మీరు ఐఫోన్ వాడుతున్నారా? మీ డేటాకు సంబంధించి కేంద్రం చేసిన పలు సూచనలు ఐఫోన్ వినియోగదారులకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ యాపిల్ యూజర్లకు హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది.

iPhone Users: ఐఫోన్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. కేంద్రం ఏం చెప్పిందంటే?

ఢిల్లీ: మీరు ఐఫోన్ వాడుతున్నారా? మీ డేటాకు సంబంధించి కేంద్రం చేసిన పలు సూచనలు ఐఫోన్ వినియోగదారులకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ యాపిల్ యూజర్లకు హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది. యాపిల్(Apple iPhones)కి చెందిన పలు ప్రొడక్ట్స్ లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు సైబర్ సెక్యరిటీ ఏజెన్సీ సెర్ట్ ఇన్ ఇవాళ వెల్లడించింది. సెక్యూరిటీ లోపాలతో యూజర్ల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇది జరగకముందే సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అడ్వైజరీ జారీ అయింది. iOS, iPadOS, macOS, tvOS, watchOS, Safari బ్రౌజర్లలో భద్రతాపరమైన లోపాలున్నట్లు గుర్తించారు. వాటిని అప్ డేట్ చేసుకోవాలని లేదంటే డేటా ప్రమాదంలో పడుతుందని తెలిపింది.

కాగా శాంసంగ్ కి చెందిన పలు ఫోన్లకు ఇటీవలే కేంద్ర ఐటీ శాఖ ఇదే తరహా సెక్యూరిటీ అలర్ట్స్ జారీ చేసింది. శాంసంగ్ 11-14 ఓఎస్ తో పని చేసే సిరీస్ లలో భద్రతాపరమైన సమస్యను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 16 , 2023 | 02:50 PM