నేపాల్‌ పశుపతినాథ్‌ గుడిలో బంగారం చోరీ

ABN , First Publish Date - 2023-06-26T01:06:18+05:30 IST

నేపాల్‌లో ప్రఖ్యాతి చెందిన పశుపతినాథ్‌ ఆలయంలో బంగారం చోరీ జరిగింది. వంద కిలోల హారంలో పది కేజీల మేర బంగారం మాయమయినట్టు ఫిర్యాదులు అందాయి.....

నేపాల్‌ పశుపతినాథ్‌ గుడిలో బంగారం చోరీ

కాఠ్‌మాండూ, జూన్‌ 25: నేపాల్‌లో ప్రఖ్యాతి చెందిన పశుపతినాథ్‌ ఆలయంలో బంగారం చోరీ జరిగింది. వంద కిలోల హారంలో పది కేజీల మేర బంగారం మాయమయినట్టు ఫిర్యాదులు అందాయి. దాంతో అవినీతి నిరోధక విభాగం ఆదివారం ఆలయ ప్రాంగణాన్ని స్వాధీనంలోకి తెచ్చుకొని సోదాలు చేసింది. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి వరకు దర్శనాలను నిలిపివేసి భక్తులను రానీయలేదు. గత ఏడాది శివరాత్రి సందర్భంగా ‘జలహారి’ పేరుతో 100 కిలోల బంగారు ఆభరణాన్ని శివలింగానికి అలంకరించారు. అందులో ఇప్పుడు పది కిలోలు కనిపించడం లేదని పశుపతినాథ్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ పేర్కొంది.

Updated Date - 2023-06-26T01:06:18+05:30 IST