Gold : గోల్డ్ జిగేల్!.. రూ.60 వేలకు 10 గ్రాములు
ABN , First Publish Date - 2023-04-02T01:40:43+05:30 IST
గత ఆర్థిక సంవత్సరం(2022-23) ప్రారంభంలో రూ.52,000 స్థాయిలో ఉన్న 10 గ్రాముల బంగారం(24 క్యారెట్లు) ధర.. ఆర్థికం సంవత్సరం ముగిసే నాటికి రూ.60,000కు చేరుకుంది.
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022-23) ప్రారంభంలో రూ.52,000 స్థాయిలో ఉన్న 10 గ్రాముల బంగారం(24 క్యారెట్లు) ధర.. ఆర్థికం సంవత్సరం ముగిసే నాటికి రూ.60,000కు చేరుకుంది. సంవత్సరకాలంలో ధర రూ.8,000 ఎగబాకింది. అంటే, 2022-23 ఆరంభంలో బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పటికే 15 శాతం ప్రతిఫలం లభించిందన్నమాట. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక రిటర్నులు అందించిన అసెట్ క్లాస్ బంగార మే. కాగా, వెండి 6.7 శాతం రిటర్నులు పంచింది. ఈక్విటీలు, రూపాయి మాత్రం నేలచూపులు చూశాయి. క్రూడాయిల్, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడు లు భారీ నష్టాలనే మిగిల్చాయి. అంతర్జాతయ అనిశ్చితుల నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరం(2023-24)లోనూ బులియన్ జోరు కొనసాగవచ్చని కమోడిటీ నిపుణులు భావిస్తున్నారు. 2023-24 చివరినాటికి 10 గ్రాముల బంగారం రూ.66,000-68,000 స్థాయికి చేరుకోవచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేదీ అంచనా వేశారు.