గూగుల్‌లో ‘ఫ్రీ స్నాక్స్’ బంద్!
ABN , First Publish Date - 2023-04-03T01:47:18+05:30 IST
ఖర్చులను తగ్గించుకోవడం కోసమని గూగుల్ సంస్థ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు పనివేళల్లో ఇచ్చే ఉచిత స్నాక్స్‌ను ఇక నుంచి ఇవ్వకూడదని
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఖర్చులను తగ్గించుకోవడం కోసమని గూగుల్ సంస్థ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు పనివేళల్లో ఇచ్చే ఉచిత స్నాక్స్‌ను ఇక నుంచి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రుత్ పోరట్ శుక్రవారం ఉద్యోగులకు లేఖ రాశారు. ఆఫీసుల్లోని మైక్రో కిచెన్లను మూసివేస్తామన్నారు. ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల కోసం ల్యాప్‌టా్‌పలు కొనుగోలు చేయడానికి కూడా ఇక నుంచి కంపెనీ నిధులు కేటాయించబోదని తెలిపారు. ఖర్చుల తగ్గింపులో భాగంగా కొత్త ఉద్యోగుల నియామక ప్రక్రియ కూడా నెమ్మదిగానే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ ప్రోత్సాహకాల కుదింపు అనేది ఆఫీసులు ఉన్న ప్రాంతాలు, అక్కడి వసతులను బట్టి మారుతుందని పోరట్ చెప్పారు.