కాలిఫోర్నియాకు వరద ముప్పు

ABN , First Publish Date - 2023-03-10T04:05:55+05:30 IST

ఇప్పటికే హిమపాతంతో సతమతం అవుతున్న అమెరికాలోని కాలిఫోర్నియాకు అతి భారీ వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి ఉందంటూ గురువారం హెచ్చరికలు జారీ అయ్యాయి.

కాలిఫోర్నియాకు వరద ముప్పు

కాలిఫోర్నియా, మార్చి 9: ఇప్పటికే హిమపాతంతో సతమతం అవుతున్న అమెరికాలోని కాలిఫోర్నియాకు అతి భారీ వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి ఉందంటూ గురువారం హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షాలకు తోడు మంచు కరగడంతో వరద ముంచెత్తే ప్రమాదం ఉందంటూ వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఉత్తర, మధ్య ప్రాంతాల్లోని కోటి 70 లక్షల మంది ప్రజలపై ప్రభావం పడనుంది. రాజధాని శాక్రమెంటోతో పాటు శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలకూ వరద తాకిడి తగలనుంది. ముందుజాగ్రత్తగా రెండు వారాలకు సరిపడా సరుకులు, వరదను అడ్డుకునేందుకు ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది.

Updated Date - 2023-03-10T04:06:57+05:30 IST