Share News

బిహార్‌లో కల్తీ మద్యానికి ఐదుగురు బలి

ABN , First Publish Date - 2023-11-20T00:34:56+05:30 IST

సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బిహార్‌లో కల్తీ మద్యం తాగి అయిదుగురు మృత్యువాత పడ్డారు. సీతామఢీ జిల్లాలో బాజ్‌పట్టి పోలీసు స్టేషను పరిధిలోని

బిహార్‌లో కల్తీ మద్యానికి ఐదుగురు బలి

పట్నా, నవంబరు 19: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బిహార్‌లో కల్తీ మద్యం తాగి అయిదుగురు మృత్యువాత పడ్డారు. సీతామఢీ జిల్లాలో బాజ్‌పట్టి పోలీసు స్టేషను పరిధిలోని మూడు పొరుగు గ్రామాలకు చెందిన ఆరుగురు గురువారం రాత్రి కల్తీ మద్యం సేవించారు. వీరిలో శుక్రవారం రాత్రి ముగ్గురు, శనివారం ఉదయం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కల్తీ మద్యం అమ్మకానికి సంబంధించి ముగ్గురు వ్యాపారులను అరెస్టు చేశారు.

Updated Date - 2023-11-20T00:34:57+05:30 IST