ఫాస్టాగ్‌తో గతేడాది రూ.50,855 కోట్లు

ABN , First Publish Date - 2023-01-25T01:00:31+05:30 IST

గతేడాది ఫాస్టాగ్‌ ద్వారా రూ.50,855 కోట్ల టోల్‌ ఫీజు వసూలైంది. స్టేట్‌ హైవేలపై ఉన్న టోల్‌ ప్లాజాల వసూళ్లతో కలిపి ఈ మొత్తం 2021లో రూ.34,778 కోట్లు ఉండగా... 2022లో 46 శాతం పెరిగింది.

ఫాస్టాగ్‌తో గతేడాది రూ.50,855 కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 24: గతేడాది ఫాస్టాగ్‌ ద్వారా రూ.50,855 కోట్ల టోల్‌ ఫీజు వసూలైంది. స్టేట్‌ హైవేలపై ఉన్న టోల్‌ ప్లాజాల వసూళ్లతో కలిపి ఈ మొత్తం 2021లో రూ.34,778 కోట్లు ఉండగా... 2022లో 46 శాతం పెరిగింది. ఫాస్టాగ్‌ ద్వారా గతేడాది డిసెంబరులో నేషనల్‌ హైవేలపై టోల్‌ ప్లాజాలు రోజుకి సగటున రూ.134.44 కోట్ల ఫీజు వసూలు చేశాయి. డిసెంబరు 24న అత్యధికంగా రూ.144.19 కోట్లు వసూలయ్యాయి. ఈ వివరాలను జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వెల్లడించింది.

Updated Date - 2023-01-25T01:00:31+05:30 IST