గాయాన్ని వేగంగా నయం చేసే జెల్
ABN , First Publish Date - 2023-10-23T00:42:24+05:30 IST
డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి శుభవార్త. గాయాలను త్వరగా నయం చేయగలిగే మ్యాగ్నెటిక్ జెల్‌ను నేషనల్
డయాబెటిస్ రోగులకు ఎంతో ఉపయుక్తం
న్యూఢిల్లీ, అక్టోబరు 22: డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి శుభవార్త. గాయాలను త్వరగా నయం చేయగలిగే మ్యాగ్నెటిక్ జెల్‌ను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ జెల్ డయాబెటిస్ రోగుల్లో.. సాధారణం కన్నా మూడు రెట్లు వేగంగా గాయాలను నయం చేస్తుందని తెలిపారు. జెల్ తయారీలో కెరాటినోసైట్స్, ఫైబ్రోబ్లాస్ట్ అనే రెండు రకాల చర్మకణాలను, మ్యాగ్నెటిక్ పార్టికల్స్‌ను ఉపయోగించారు. బ్యాండేజీ సాయంతో గాయాల దగ్గర ఈ జెల్‌ను రాసి.. వైర్‌లెస్ సిస్టమ్ ద్వారా మ్యాగ్నెటిక్ పార్టికల్స్‌తో చర్మకణాలను క్రియాశీలకం చేసి గాయాలను త్వరగా మానిపించవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ వివరాలను అడ్వాన్స్‌డ్ మెటీరియల్ అనే జర్నల్‌లో ప్రచురించారు. ‘‘ఈ జెల్ గాయం దగ్గర గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. చర్మకణాలను ఉత్తేజితం చేసి గాయాన్ని వేగంగా నయం చేస్తుంది’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆండీ టే చెప్పారు.