కొల్హాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. కర్ఫ్యూ
ABN , First Publish Date - 2023-06-08T02:46:00+05:30 IST
వాట్సాప్‌లో ఓ వివాదాస్పద స్టేటస్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
కొల్హాపూర్, జూన్ 7: వాట్సాప్‌లో ఓ వివాదాస్పద స్టేటస్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, టిప్పు సుల్తాన్‌లను ప్రస్తుతిస్తున్న ఆ స్టేటస్‌పై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం కొల్హాపూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆ సంస్థల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులు శివాజీ మహరాజ్ చౌక్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. ఇది హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడం, లూఠీకి దిగడం వల్లే లాఠీచార్జి చేశామని పోలీసులు చెబుతున్నారు. నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.