ESI Hospitals : కర్నూలు, శంషాబాద్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రులు

ABN , First Publish Date - 2023-02-21T03:39:41+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో రెండు ఈఎస్‌ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ESI Hospitals : కర్నూలు, శంషాబాద్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో రెండు ఈఎస్‌ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో 30 పడకల ఆస్పత్రి, తెలంగాణలోని శంషాబాద్‌లో 100 పడకల ఆస్పత్రిని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన 190వ ఈఎస్‌ఐఐసీ సమావేశంలో దీన్ని ఆమోదించారు. అలాగే విజయవాడలోని ఈఎ్‌సఐ ఆస్పత్రిని ఈఎ్‌సఐఎస్‌ టేకోవర్‌ చేయాలని నిర్ణయించారు.

Updated Date - 2023-02-21T03:39:43+05:30 IST