Turkey election: టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోడాన్ మూడో సారి విజయం

ABN , First Publish Date - 2023-05-29T07:50:52+05:30 IST

టర్కీ దేశంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎర్డోగాన్ మూడవసారి ఎన్నికయ్యారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తిరిగి ఎన్నికల్లో గెలుపొందారు....

Turkey election: టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోడాన్ మూడో సారి విజయం
Erdogan wins Turkey President

అంకారా: టర్కీ దేశంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎర్డోగాన్ మూడవసారి ఎన్నికయ్యారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తిరిగి ఎన్నికల్లో గెలుపొందారు.(Turkey election) టర్కీ దేశంలో అధిక ద్రవ్యోల్బణం,భారీ భూకంపం తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడవ దశాబ్దానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.(Erdogan wins Turkey President) ఎర్డోగాన్ నాటో కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎర్డోగాన్‌కు 52శాతం ఓట్లు వచ్చాయి. అతని ప్రత్యర్థి కెమల్ కిలిక్‌డరోగ్లుకి 48శాతం ఓట్లు వచ్చాయి. టర్కీ ఎలక్టోరల్ బోర్డ్ అధిపతి ఎర్డోగాన్ విజయాన్ని ధృవీకరించారు.

టర్కీకి చెందిన ఎర్డోగాన్ ఒపీనియన్ పోల్స్‌ను కాదని కీలకమైన అధ్యక్ష ఎన్నికల రేసులో ముందంజలో ఉన్నారు.మరో ఐదేళ్లపాటు అధ్యక్ష పదవిని తనకు అప్పగించినందుకు ఎర్డోగాన్ దేశానికి ధన్యవాదాలు తెలిపారు.ఫలితాలు వెలువడిన తర్వాత ఇస్తాంబుల్‌లోని తన ఇంటి వెలుపల ప్రచార బస్సులో మద్దతుదారులతో మాట్లాడారు. తాను 21 సంవత్సరాలుగా మీ నమ్మకానికి అర్హుడినని ఎర్డోగాన్ చెప్పారు.ఎర్డోగాన్ మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి టర్కీ అధికార పార్టీ జెండాలను ఊపుతూ, కారు హారన్లు మోగిస్తూ, ఆయన పేరును జపిస్తూ సంబరాలు చేసుకున్నారు.

Updated Date - 2023-05-29T08:02:15+05:30 IST