బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసిన ఈడీ

ABN , First Publish Date - 2023-04-13T13:33:45+05:30 IST

ప్రముఖ మీడియా సంస్థ బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా (BBC India)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (Enforcement Directorate) తాజాగా కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారం(Dealing with foreign funds)లో బీబీసీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది.

బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసిన ఈడీ

ప్రముఖ మీడియా సంస్థ బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా (BBC India)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (Enforcement Directorate) తాజాగా కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారం(Dealing with foreign funds)లో బీబీసీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది. ఈ కేసు విచారణతో భాగంగా ఆర్థిక లావాదేవీల(Financial transactions) వివరాలను సమర్పించాలని బీబీసీ ఇండియా(BBC India)ను ఈడీ ఆదేశించింది. అదేవిధంగా విదేశీ రెమిటెన్సుల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలియజేశాయి.

కాగా బీబీసీ ఇండియా(BBC India) కార్యాలయంలో గతంలో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించిన సంగతి విదితమే. అయితే ఆ తనిఖీలను ‘సోదాలు కాదని, సర్వే’ అని అధికారులు తెలిపారు. గోద్రా(Godhra) మారణకాండ వెను క అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) ప్రమేయం ఉందంటూ గతంలో బీబీసీ ఓ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.

ఇది జరిగిన కొద్ది రోజులకే ఈ తనిఖీలు(Inspections) చోటుచేసుకోవడం గమనార్హం. గుజరాత్‌ అల్లర్లలో ప్రదాని మోదీ హస్తం ఉందని ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ పేరిట రెండు భాగాలుగా విడుదలైన డాక్యుమెంటరీ(Documentary)లో బీబీసీ పేర్కొంది. కాగా దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోదీకి క్లీన్‌చిట్‌(Cleanchit) లభించాక కూడా ఇలా అభాండాలు మోపడమేమిటని భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం(Objection) వ్యక్తం చేసింది.

Updated Date - 2023-04-13T13:40:31+05:30 IST