Electric bus: బెంగళూరు - మైసూరుల మధ్య రేపు ఎలక్ట్రిక్ బస్సు
ABN , First Publish Date - 2023-01-15T11:58:12+05:30 IST
బెంగళూరు, మైసూరు(Bangaluru, Mysore) నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సు సేవలు అందు బాటులోకి రానున్నాయి. కర్ణాటక రాష్ట్ర
బెంగళూరు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు, మైసూరు(Bangaluru, Mysore) నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సు సేవలు అందు బాటులోకి రానున్నాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) కేంద్రప్రభుత్వ ఫేమ్-2 పథకం కింద అంతర నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే శుక్రవారం ప్రయో గాత్మ కంగా చేపట్టగా విజయవంతమైంది. మరో నెలరోజుల్లో బెంగళూరు నుంచి దావణగెరె, చిక్కమగళూరు, శివ మొగ్గ, మడికేరి, విరాజ్‌పేటలకు ఎలక్ట్రిక్ బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒలెకాట్ గ్రీన్‌టెక్ కంపెనీ నుంచి జీసీసీ (గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు) పద్ధతిన 50 బస్సులను కేఎస్‌ఆర్టీసీ పొందుతోంది. ఇందులో మొదటి బస్సు ఈ మార్గంలో సంచరించనుంది. మిగిలిన 49 బస్సులు వివిధ దశలలో రోడ్డెక్కనున్నాయి. మైసూరు, మడికేరి, విరాజ్‌పేట, దావణగెరె, శివమొగ్గ, చిక్క మగళూరుల మధ్య సంచరించనున్నాయని కేఎస్‌ఆర్టీసీ ఎండీ వీ అన్బుకుమార్ నగరంలో మీడియాకు తెలిపారు. ఈ బస్సు బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 320 కిలో మీటర్ల మేర సంచరిస్తుందన్నారు. ఆరు చోట్ల చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ ఒక గంట చార్జ్ చేసుకుని మళ్లీ రాజధానికి వస్తాయన్నారు.