Share News

మద్యం కేసులో సంజయ్‌ సింగ్‌ నిందితుడే: ఈడీ

ABN , First Publish Date - 2023-12-03T02:26:04+05:30 IST

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ నిందితుడని పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

మద్యం  కేసులో సంజయ్‌ సింగ్‌ నిందితుడే: ఈడీ

న్యూఢిల్లీ, డిసెంబరు 2: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ నిందితుడని పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్థానిక ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసింది. మనీలాండరింగ్‌కు, కుట్రకు పాల్పడ్డారని, ఈ కేసులోని ఇతర నిందితులకు సహకరించారని ఆరోపించింది. ఈ ఛార్జిషీటులో మరొకరి పేరును ప్రస్తావించినా ఆ వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. దీంతో ఈ కేసుపై మొత్తం ఆరు ఛార్జిషీట్లు దాఖలయినట్టయింది. సంజయ్‌ సింగ్‌ను అక్టోబరు నెలలో ఈడీ అరెస్టు చేసింది. వ్యాపారవేత్త దినేష్‌ అరోడా.. సంజయ్‌ సింగ్‌ నివాసానికి రెండు సార్లు వెళ్లి రూ.రెండు కోట్లు ఇచ్చారని ఆరోపించింది. ఈ ఆరోపణలను ఆయన గతంలోనే ఖండించారు.

Updated Date - 2023-12-03T02:26:05+05:30 IST