Earthquake: కొత్త సంవత్సరం రోజే మేఘాలయను వణికించిన భూకంపం
ABN , First Publish Date - 2023-01-02T08:16:33+05:30 IST
కొత్త సంవత్సరం రోజే మేఘాలయలో భూకంపం సంభవించింది....
నంగపొహ(మేఘాలయ): కొత్త సంవత్సరం రోజే మేఘాలయలో భూకంపం సంభవించింది. (New Year)మేఘాలయలోని నంగపొహ ప్రాంతంలో ఆదివారం రాత్రి 11.28 గంటలకు భూకంపం సంభవించింది.(Earthquake jolts Meghalay) ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(National Center for Seismology) వెల్లడించింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. రాత్రివేళ నిద్రపోతున్న జనం భూప్రకంపనలతో బయటకు పరుగులు తీశారు.జనవరి 1వతేదీ రోజు ఢిల్లీ పరిసర ప్రాంతాలను భూకంపం వణికించింది. ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. కొత్త సంవత్సరం వేడుకలు సాగుతుండగానే ఢిల్లీ, మేఘాలయలో భూకంపం సంభివించడంతో ప్రజలు షాక్ అయ్యారు.