దుర్గం చిన్నయ్యను శిక్షించాలి: శేజల్
ABN , First Publish Date - 2023-06-05T03:16:45+05:30 IST
తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దుర్గం చిన్నయ్యను, ఆయన అనుచరులను శిక్షించాలని ఆరిజన్...
న్యూఢిల్లీ, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దుర్గం చిన్నయ్యను, ఆయన అనుచరులను శిక్షించాలని ఆరిజన్ డెయిరీ యాజమాని బోడపాటి శేజల్ డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేజల్ ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని, వారిని శిక్షించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.