ఆ ఇద్దరికీ నో ఎంట్రీ!
ABN , First Publish Date - 2023-04-24T02:45:31+05:30 IST
వివిధ కేసుల్లో చిక్కుకున్న ఇద్దరు నేతలు.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిక్కులు ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి వినయ్ కులకర్ణి ధార్వాడ్ జిల్లాలోకి వెళ్లడానికి వీల్లేదని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
వివిధ కేసుల కారణంగా గాలి జనార్దన్ రెడ్డి, కులకర్ణి ప్రచారంపై రెండు జిల్లాల్లో నిషేధం
బెంగళూరు, ఏప్రిల్ 23: వివిధ కేసుల్లో చిక్కుకున్న ఇద్దరు నేతలు.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిక్కులు ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి వినయ్ కులకర్ణి ధార్వాడ్ జిల్లాలోకి వెళ్లడానికి వీల్లేదని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. అయితే, ధార్వాడ్ నియోజకవర్గం టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ కులకర్ణికే కేటాయించింది. దీంతో ఆయనకు బదులుగా ఆయన సతీమణి శివలీల నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కులకర్ణి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. 2020లో జరిగిన బీజేపీ నేత హత్య కేసులో కులకర్ణి నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా కేఆర్‌పీపీ అధ్యక్షుడు గాలి జనార్దన్‌రెడ్డిని బళ్లారి జిల్లాలోకి అడుగు పెట్టరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన పొరుగున ఉన్న కొప్పళ్ జిల్లాలోని గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, గాలి సతీమణి లక్ష్మీ అరుణ మాత్ర కేఆర్‌పీపీ టికెట్‌పై బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.