Share News

అబార్షన్‌కు వెళ్లిన మహిళతో డాక్టర్‌ అసభ్య ప్రవర్తన

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:39 AM

అబార్షన్‌ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళతో మత్తుమందు వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చెన్నైలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వెలుగు చూసింది. స్థానిక

అబార్షన్‌కు వెళ్లిన మహిళతో డాక్టర్‌ అసభ్య ప్రవర్తన

చెన్నై, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అబార్షన్‌ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళతో మత్తుమందు వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చెన్నైలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వెలుగు చూసింది. స్థానిక విల్లివాక్కంకు చెందిన మహిళ (30) అనారోగ్యం కారణంగా అబార్షన్‌ చేయించుకునేందుకు సమీపంలోని ఓ ఆస్పత్రికి శుక్రవారం వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు అనస్తీషియా డాక్టర్‌ ఇళమారన్‌ మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి, అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని ఆమె అబార్షన్‌ అయ్యాక భర్తకు చెప్పింది. దీంతో ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి ఇళమారన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 06:50 AM