Donald Trump: వచ్చే వారం నన్ను అరెస్టు చేస్తారు!
ABN , First Publish Date - 2023-03-19T01:19:42+05:30 IST
వచ్చే వారంలో తనను పోలీసులు అరెస్టు చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆరోపించారు. ఈ మేరకు తనకు మానహటన్ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి సమాచా రం ఉందని తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఆయన వెల్లడించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణ
వాషింగ్టన్, మార్చి 18: వచ్చే వారంలో తనను పోలీసులు అరెస్టు చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆరోపించారు. ఈ మేరకు తనకు మానహటన్ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి సమాచా రం ఉందని తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఆయన వెల్లడించారు. ‘‘రిపబ్లికన్ పార్టీకి చెందిన అభ్యర్థి, దేశ మాజీ అధ్యక్షుడిని వచ్చే మంగళవారం అరె స్టు చేయనున్నారు. ఒకవేళ అదే జరిగితే నిరసనలు చేయండి. దేశాన్ని వెనక్కి తీసుకోండి’’ అని నిరసనకారులకు ఆయన పిలుపునిచ్చారు. 2016లో అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో ఒక నీలిచిత్రాల నటికి చేసిన చెల్లింపుల విషయంలోనే ఆయన్ను అరెస్టు చేయనున్నట్లు మానహటన్ జిల్లా అటార్నీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.