తీస్తా సీతల్వాడ్ డిశ్చార్జి పిటిషన్ తిరస్కరణ
ABN, First Publish Date - 2023-07-21T03:25:44+05:30 IST
గుజరాత్ అల్లర్ల కేసులో నకిలీ సాక్ష్యాధారాలను సృష్టించి అమాయకులను వేధిస్తున్నారన్న ఆరోపణలతో నమోదైన కేసు నుంచి తన పేరును
అహ్మదాబాద్, జూలై 20: గుజరాత్ అల్లర్ల కేసులో నకిలీ సాక్ష్యాధారాలను సృష్టించి అమాయకులను వేధిస్తున్నారన్న ఆరోపణలతో నమోదైన కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ ప్రముఖ హక్కుల కార్యకర్త తీస్తా సీతల్వాడ్ వేసిన డిశ్చార్జి పిటిషన్‌ను అహ్మదాబాద్ కోర్టు తిరస్కరించింది. అంతే కాదు.. సోమవారం నుంచి (జూలై 24) ఈ కేసు విచారణ ప్ర క్రియకు సిద్ధంగా ఉండాలని డిఫెన్స్, ప్రాసిక్యూషన్ వర్గాలకు అదనపు సెషన్స్ జడ్జి ఏఆర్ పటేల్ సూచించారు. ఈ కేసులోనే బుధవారం సుప్రీంకోర్టు సీతల్వాడ్‌కు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Updated at - 2023-07-21T03:25:44+05:30