జేఈఈ ప్రవేశ పరీక్ష ఉన్నప్పటికీ.. ఇంటర్‌లో 75 శాతం నిబంధన ఎందుకు?
ABN , First Publish Date - 2023-04-07T03:19:35+05:30 IST
ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో చేరేందుకు జేఈఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ ఇంటర్‌లో 75శాతం మార్కుల నిబంధన ఎందుకు అమలు చేస్తున్నారని
ముంబై, ఏప్రిల్ 6: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో చేరేందుకు జేఈఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ ఇంటర్‌లో 75శాతం మార్కుల నిబంధన ఎందుకు అమలు చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు తగిన కారణాలు ఏంటో తెలపాలని ఆదేశాలు జారీచేసింది. వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.