Electricity bill hike: విద్యుత్ వినియోగదారులకు షాక్...8 శాతం సర్‌ఛార్జి..!

ABN , First Publish Date - 2023-06-26T19:53:03+05:30 IST

దేశ రాజధానిలో విద్యుత్ ఛార్జీల భారీ వడ్డన జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఢిల్లీ పవర్ రెగ్యులేటర్ అనుమతి ఇచ్చింది. దీంతో 200 యూనిట్లకు పైబడి విద్యుత్ వాడుకునే వినియోగదారులపై అదనంగా 8 శాతం సర్‌ఛార్జి పడనుంది.

Electricity bill hike: విద్యుత్ వినియోగదారులకు షాక్...8 శాతం సర్‌ఛార్జి..!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో విద్యుత్ ఛార్జీల (Power tariffs) భారీ వడ్డన జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఢిల్లీ పవర్ రెగ్యులేటర్ అనుమతి ఇచ్చింది. దీంతో 200 యూనిట్లకు పైబడి విద్యుత్ వాడుకునే వినియోగదారులపై అదనంగా 8 శాతం సర్‌ఛార్జి పడనుంది. 200 యూనిట్లు లోపు విద్యుత్ వాడుకునే వారికి మాత్రం విద్యుత్ టారిఫ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి (Atishi) సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పొందుతున్న వారిపై విద్యుత్ చార్జీల పెంపు వర్తించదని తెలిపారు. తక్కిన వినియోగదారులు 8 శాతం సర్‌ఛార్జి చెల్లించాల్సి ఉంటుందన్నారు.

పవర్ రెగ్యులేటరీ అనుమతించిన ప్రకారం, బీఎస్ఈఎస్ యుమున పవర్ లిమిటెడ్ (బీవైపిఎల్) ప్రస్తుతం వసూలు చేస్తు్న్న ఛార్జి కంటే 9.42 శాతం ధరలు పెంచుకోవచ్చు. బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్) 6.39 శాతం, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) 2 శాతం విద్యుత్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించారు. విద్యుత్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని కోరుతూ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పిటిషన్లు వేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

కేంద్రాన్ని తప్పుపట్టిన మంత్రి..

కాగా, విద్యుత్ రేట్ల పెరుగుదలకు కేంద్రమే కారణమని మంత్రి అతిషి ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు చాలా కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వహణాలోపం, కోల్‌ బ్లాక్‌ల రేట్లు పెంచడం వల్లే ఢిల్లీలో విద్యుత్ టారిఫ్ పెరిగినట్టు ఆమె తెలిపారు. ఎల్పీజీ గ్యాస్, బొగ్గు ధరలను కేంద్రం నిర్ణయిస్తున్న కారణంగానే పవర్ పర్చేజ్ అడ్జెస్ట్‌మెంట్ చార్జీలను విద్యుత్ కంపెనీలు పెంచుతున్నాయని అన్నారు. దేశంలో అనేకమైన బొగ్గు గనులున్నప్పటికీ 75 ఏళ్ల చరిత్రలో తొలిసారి బొగ్గు కొరత తలెత్తిందన్నారు. బొగ్గు, గ్యాస్ ధరలు ఎందుకు పెంచిదో కేంద్రం చెప్పాలని మంత్రి నిలదీశారు.

Updated Date - 2023-06-26T19:53:03+05:30 IST