ప్రపంచంలోనే టాప్ 10 కాలుష్య నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై
ABN , First Publish Date - 2023-11-14T04:12:33+05:30 IST
మనదేశంలో కాలుష్య నగరాలు పెరుగుతున్నాయా? వాయు కాలుష్య నగరంగా ఢిల్లీతో మరో రెండు నగరాలు పోటీ పడుతున్నాయా? స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ఎయిర్ క్వాలి
న్యూఢిల్లీ, నవంబరు 13: మనదేశంలో కాలుష్య నగరాలు పెరుగుతున్నాయా? వాయు కాలుష్య నగరంగా ఢిల్లీతో మరో రెండు నగరాలు పోటీ పడుతున్నాయా? స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) జాబితా చూస్తే ఢిల్లీ తర్వాత కోల్‌కతా, ముంబై నగరాల్లోనూ కాలుష్యం ‘ప్రమాదకర స్థాయి’కి చేరుకుంటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పటాకుల పండుగ దీపావళి జరిగిన వెంటనే ఏక్యూఐ జాబితా విడుదలైంది. ఇందులో టాప్-10 నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై రూపంలో మూడూ మన దేశం నుంచే ఉన్నాయి. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 420తో టాప్‌లో ఉంటే.. 196తో కోల్‌కతా నాలుగో స్థానంలో, 163తో ముంబై ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500-500 మధ్య ఉంటే ప్రజారోగ్యం అత్యంత ప్రమాదంలో పడుతుంది. అప్పటికే వివిధ వ్యాధులు ఉన్న వారికి ఇది మరింత సమస్యాత్మకం అవుతుంది.