రాహుల్ పాస్‌పోర్టుకు ఢిల్లీ కోర్టు ఎన్‌వోసీ
ABN , First Publish Date - 2023-05-27T04:05:22+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. పాస్‌పోర్టు వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ కోర్టు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేసింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. పాస్‌పోర్టు వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ కోర్టు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేసింది. అయితే, రాహులగాంధీ కోరుకున్నట్టు 10 ఏళ్ల సమయానికి కాకుండా కేవలం మూడేళ్లకు, అదికూడా ఆర్డినరీ పాస్‌పోర్టుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడి, పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ తన డిప్లొమాటిక్ పాస్‌పోర్టును సరెండర్ చేశారు. మరోవైపు, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్‌గాంధీ నిందితుడిగా ఉన్నందున ఆయన పాస్‌పోర్టు పొందేందుకు ఎన్‌వోసీ అవసరమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టును ఆశ్రయించారు.