dalai lama video: బాలునికి లిప్‌లాక్ ఇస్తూ దలైలామా ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-04-10T09:20:54+05:30 IST

దలైలామా(Dalai Lama) తాజా వీడియో కలకలం రేపుతోంది. అందులో దలైలామా ఒక బాలుని పెదవులపై ముద్దు పెట్టుకుంటూ(kissing) కనిపించారు. ఈ వీడియోలో ఆయన ఆ బాలుతో 'నాలుకను చప్పరించమని' కోరడం కూడా కనిపిస్తుంది.

dalai lama video: బాలునికి లిప్‌లాక్ ఇస్తూ దలైలామా ఏమన్నారంటే..

దలైలామా(Dalai Lama) తాజా వీడియో కలకలం రేపుతోంది. అందులో దలైలామా ఒక బాలుని పెదవులపై ముద్దు పెట్టుకుంటూ(kissing) కనిపించారు. ఈ వీడియోలో ఆయన ఆ బాలుతో 'నాలుకను చప్పరించమని' కోరడం కూడా కనిపిస్తుంది. ఈ వీడియో బయటకు వచ్చిన నేపధ్యంలో సోషల్ మీడియా(Social media)లో దలైలామాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోపై ట్విట్టర్ యూజర్స్ తీవ్రంగా స్పందించారు. వీడియోను షేర్ చేసిన ట్విట్టర్ యూజర్(Twitter user) ఒకరు.. 'దలైలామా ఒక బౌద్ధ కార్యక్రమంలో భారతీయ బాలుడిని ముద్దుపెట్టుకున్నారు. బాలుని నాలుకను చప్పరించడానికి కూడా ప్రయత్నించారు '@దలైలామా' అని ట్యాగ్ చేశారు.

మరో ట్విట్టర్ యూజర్ దీపికా పుష్కర్ నాథ్... ‘ఇది అసభ్యకరం(obscene). ఇటువంటి దలైలామా ప్రవర్తనను ఎవరూ సమర్థించకూడదు’ అని రాశారు. అంతకుముందు 2019లో దలైలామా(Dalai Lama) తన వారసురాలిగా మారే మహిళ "ఆకర్షణీయంగా" ఉండాలని వ్యాఖ్యానించి వివాదాన్ని ఎదుర్కొన్నారు. 2019లో ధర్మశాల(Dharamshala)లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధమైన వ్యాఖ్య చేసి, ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలయ్యారు.

అనంతరం దలైలామా తన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు(Apologies) చెప్పారు. గత నెలలో దలైలామా.. మంగోలియన్ బాలుడు 10వ ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచేగా అభివర్ణించారు. ఇది చైనా(China)కు కోపం తెప్పించే అంశంగా మారిందనే వార్తలు వినిపించాయి. టిబెట్‌లో దలైలామా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ బీజింగ్(Beijing) ఆరోపించింది.

Updated Date - 2023-04-10T10:11:37+05:30 IST