Cybercrime SP: ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2023-01-25T10:34:15+05:30 IST

ఆన్‌లైన్‌లో బ్యాంక్‌ ఖాతాకు సంబంధించి వచ్చే మెసేజ్‌లు నమ్మరాదని, అలాంటి వాటిపై ‘1930’ అనే నెంబరుకు ఫిర్యాదు చేయాలని సైబర్‌ క్రైం ఎస్పీ

Cybercrime SP: ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

- సైబర్‌ క్రైం ఎస్పీ గుణశేఖరన్‌

వేలూరు(చెన్నై), జనవరి 24: ఆన్‌లైన్‌లో బ్యాంక్‌ ఖాతాకు సంబంధించి వచ్చే మెసేజ్‌లు నమ్మరాదని, అలాంటి వాటిపై ‘1930’ అనే నెంబరుకు ఫిర్యాదు చేయాలని సైబర్‌ క్రైం ఎస్పీ గుణశేఖరన్‌(Cybercrime SP Gunasekharan) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సీఎంసీ భారతినగర్‌కు చెందిన హీమా సీఎంసీ ఆస్పత్రిలో వైద్య సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఇటీవల తన సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లో బ్యాంక్‌ ఖాతా వివరాలు అప్‌లోడ్‌ చేయాలని ఉండడంతో, దానిని నమ్మిన ఆమె వివరాలు అప్‌లోడ్‌ చేశారు. కొద్దిసేపటికి ఆమె ఖాతా నుంచి రూ.2 లక్షలు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో, బాధితురాలు జిల్లా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు ఆమె పోగొట్టుకున్న రూ.1,99,999 విడిపించి ఆమెకు అప్పగించారు.

Updated Date - 2023-01-25T10:34:17+05:30 IST